" శాకాహార పాదయాత్ర "
నా పేరు "మురళీకృష్ణ". నేను 2009 సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. గతంలో హృదయసంబంధిత వ్యాధితో బాధపడుతూ చాలా బలహీనంగా ఉండిన నేను శాకాహారిగా మారి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అయి ఇప్పుడు ఏ మందులు వాడకుండానే కులాసాగా తిరుగుతూ ఉన్నాను! అనేక గ్రామాల్లో, పాఠశాలల్లో, చర్చీల్లో మరి దేవాలయాల్లో ప్రచారం చేసుకుంటూ క్షణం తీరికలేకుండా ఉన్నాను!
శాకాహారం ద్వారా నేను పొందిన లాభాలను అందరికీ తెలియజెయ్యాలనే సత్సంకల్పంతో 25.9.2014 తేదీన విజయవాడ నుంచి "శాకాహార పాదయాత్ర" ను చేపట్టి మహబూబ్నగర్, కడ్తాల్, కైలాసపురి వరకు 350 కిలోమీటర్లు మధ్య గ్రామ గ్రామంలో శాకాహార కరపత్రాలను పంపిణీ చేస్తూ వచ్చాను. ఈ యాత్రలో నేను పొందిన ఆనందం అంతా ఒక ఎత్తయితే .. కైలాసపురిలో పత్రీజీని కలిసి యాత్ర పూర్తి చేసుకుని వారి అభినందనలు అందుకోవడం మరొక ఎత్తు!
ఆ స్ఫూర్తితోనే మళ్ళీ ఇప్పుడు 2015 మార్చి 20 వ తేది నుంచి రెండవ విడత "శాకాహార పాదయాత్ర" ను ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని గ్రామాలలో నిర్వహిస్తున్నాను.
ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా నేను పొందిన ఆరోగ్యం మరి ఆనందం అందరూ పొందేలా చేయడమే నా జీవితలక్ష్యంగా తెలుసుకుని ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చిన పత్రీజీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
దేవరకొండ మురళీకృష్ణ
తూర్పుకోడిగుడ్లపాదు గ్రామం
ప్రకాశం జిల్లా
సెల్: +9196523 98129