" ధ్యానంతో శుభోదయం"

 

నా పేరు "పరమేశ్వర్". నేను 2012 సంవత్సరం మా అన్నయ్య మరి బచ్చన్నపేట పిరమిడ్ మాస్టర్ అయిన "గుంటిపెల్లి మల్లికార్జున్" గారి ద్వారా ధ్యానప్రపంచంలోకి అడుగుపెట్టారు. 41 రోజుల మండల ధ్యానంతో నేను ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూన్న తలనొప్పి మరి సైనసైటీస్ బాధలనుంచి విముక్తి చెందాను. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ బచ్చన్నపేట మాస్టర్లతో కలిసి ధ్యాన-శాకాహార ప్రచారాలను చేపట్టాను. 

 

ఈ క్రమంలో ఒఅక్ రోజు ధ్యానప్రచార నిమిత్తం బచ్చన్నపేటకు విచ్చేసిన పత్రీజీని చూసి "ఈయన అందరిలాంటి మామూలు గురువే" అనుకున్నాను. కొంతకాలం తరువాత మల్లికార్జున్ రావు గారితో కలిసి హైదరాబాద్ కైలాసపురిలోని మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో జరుగుతూన్న ఒక ధ్యాన కార్యక్రమానికి వెళ్ళి.. అక్కడ వేదికపై కుర్చుని సూర్యకోటి తేజోమయులుగా వెలిగిపోతూన్న పత్రీజీని చూసి ఆశ్చర్యపోయాను!

 

ధ్యానంలో నా దివ్యచక్షువు ఉత్తేజితమై నా గతజన్మలు చూసుకున్నాను. ఈ జన్మలో నా కర్తవ్యం నాకు బోధపడి బచ్చన్న పేట పిరమిడ్ మాస్టర్స్ హరిరాములు, గణేశ్, ప్రణయ్‌ల సహకారంతో బచ్చన్నపేట బస్టాండ్‌లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా "బుద్ధా పిరమిడ్ ధ్యానమందిరం" నిర్మించి 2013 గురుపౌర్ణమి రోజున ప్రారంభించుకోవడం జరిగింది. 

 

ఇలా ధ్యానం ద్వారా .. ధ్యాన ప్రచారం ద్వారా నన్ను నేను ఉద్ధరించుకునేలా చేస్తూన్న ప్రియతమ పత్రీజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

 

 

జై ధ్యానజగత్! జై జై శాకాహారజగత్!!

గుంటి పెల్లి పరమేశ్వర్

బచ్చన్నపేట

వరంగల్ జిల్లా

సెల్:+9189785 83226

Go to top