పిరమిడ్ శక్తి మీద నమ్మకం మరింత బలపడింది "

 

నా పేరు "సత్యనారాయణ". మాది జోగవాని పాలెం, గాజువాక, విశాఖపట్టణం. "సిద్ధార్థా పిరమిడ్ ధ్యానమందిరం". 

 

హుద్‌హుద్ తుఫాను రోజు ప్రకృతి విలయ తాండవం చేసింది. 200 కి||మీ వేగంతో గాలి, విపరీతమైన వర్షం, చుట్టుప్రక్కల వున్న ఇళ్ళల్లో ఉన్న వారంతా ఇళ్ళు కూలిపోతాయేమోనన్న భయంతో బయటకు పోలేక, ఇంట్లో ఉండలేక ఆందోళనతో ఉండడం చూశాను. చుట్టూ ఉన్న చెట్లు పూర్తిగా విరిగిపోయి ఇళ్ళపై పడిపోయాయి. రేకుల షెడ్లు నామరూపాలు లేకుండా పూర్తిగా ఎగిరిపోయాయి.

 

ఆ సమయంలో మా ఇంటిలో ఉన్న మూడు కుటుంబాల వాళ్ళం ధ్యానంలో కూర్చున్నాం. మాలో ఎవ్వరికీ ఎటువంటి భయం కలుగలేదు. పిరమిడ్ శక్తి మీద మాకు ఉన్న నమ్మకం అటువంటిది. మా ఇంటికి గానీ, పిరమిడ్‌కు గానీ ఎటువంటి నష్టం కలుగలేదు!

 

మేడ మీద ఓపెన్ ప్లేస్‌లో ఉన్న వాటర్ ట్యాంక్ (ప్లాస్టిక్‌ది)పైపు ఊడి ప్రక్క మేడ మీద పడింది అంతే! మేము ప్రతినిత్యం ధ్యానం చేస్తూ, ధ్యానశక్తి విశ్వకళ్యాణానికి ఉపయోగపడాలని కోరుతూ ఉంటాము. నిజానికి చెప్పాలంటే, "ఇంతటి తుఫాను తీవ్రత లోనూ ‘విశాఖపట్టణం ఇలా ఉంది అంటే కారణం విశాఖ ధ్యానుల వలన, ధ్యానకేంద్రాలు, పిరమిడ్‌ల వల్లనే" అని నేను నమ్ముతున్నాను.

 

అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా కావాలనీ, విస్తారంగా పిరమిడ్లు నిర్మించాలనీ ఆశిస్తూ .. ఇటువంటి ధ్యానాన్ని ప్రపంచానికి అందించిన బ్రహ్మర్షి పత్రీజీ గారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.

 

 

సూరంపూడి సత్యనారాయణ

విశాఖపట్టణం

Go to top