" పిరమిడ్ వల్ల మేం రక్షించబడ్డాం "

 

 

నా పేరు "శివగణేశ్వరరావు". 2012 వ సంవత్సరంలో మేము పత్రీజీ దివ్య ఆశీస్సులతో మా ఇంటిపైన రెండవ అంతస్థులో 12'X12' పిరమిడ్ నిర్మించడం జరిగింది. నిరంతర ధ్యానశిక్షణ తరగతులు, పౌర్ణమి ధ్యానాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. 

 

గత సంవత్సరం వచ్చిన హుద్‌హుద్ తుఫాను విశాఖపట్నం మొత్తాన్ని అతలాకుతలం చేసినది. ఈ తుఫాను ధాటికి విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఇంటికీ ఎంతో కొంత నష్టం వాటిల్లింది. ఆర్థికంగా ప్రతి కుటుంబమూ నష్టపోయింది. 

 

మా ఇంటిపైన ఒకటవ అంతస్థు నిర్మాణం జరిపి దానిపైన పిరమిడ్ కట్టడం జరిగింది. ఇల్లు అంతా ఫ్రంట్ ఎలివేషన్ అద్దాలతో నిర్మించాము. ఇంటిపైన పిరమిడ్ యొక్క శక్తివల్ల మా ఇంటికి కానీ, పిరమిడ్‌కి కానీ ఎటువంటి నష్టం కలుగలేదు! చుట్టుప్రక్కల ఉన్న ఇళ్ళన్నింటికీ ఏదో రూపంలో నష్టం కలిగినా మా ఇంటికి మాత్రం నష్టం రాలేదు! 

 

తుఫాను భీభత్సం రోజు నేను అంతా వీక్షించడం జరిగింది. రేకులు, చెట్టుకొమ్మలు గాలిలో ఎగిరి వస్తున్నా అవి మా ఇంటి దరిదాపులలో ఎక్కడా పడలేదు. దూరంగా పడేవి. ఆ మరుసటి రోజు మా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఫోన్ చేసి పిరమిడ్ గురించి, ఇంటి గురించి "ఎలా ఉంది?" అడిగారు. అందరికీ ఒకే సమాధానం చెప్పాను: "పిరమిడ్ మమ్మల్ని కాపాడింది: పిరమిడ్ ఎనర్జీ వలన అంతటి ప్రళయం వచ్చినా మాకు ఎటువంటి నష్టం కలుగలేదు"

 

 

పిరమిడ్ సొసైటీ లక్ష్యం ప్రతి ఇంటికి పిరమిడ్ నిర్మాణం జరగాలి. అందరూ కూడా పిరమిడ్ నిర్మాణం చేపడతారని కోరుకుంటూ .. పత్రి సార్‌కి మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

 

మీసాల శివగణేశ్వరరావు

విశాఖపట్టణం

సెల్ :+9193460 92999

Go to top