" పిరమిడ్ మహిమ అద్భుతం "

 

 

నా పేరు "మూర్తి". నా భార్య పేరు అనసూయ .. మేము విశాఖపట్టణం విశాఖ డైరీ దగ్గర్లో ఉన్న "అక్కిరెడ్డి పాలెం" లో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. నాకు 2009లో పిరమిడ్ ధ్యానం పరిచయమయి 2012లో మా డాబా మీద 12'X12' పిరమిడ్ కట్టుకుని మేము ధ్యానం చేస్తూ 40 రోజుల ధ్యానశిక్షణా కార్యక్రమం చేసాము. దానిలో చాలా మంది రోజూ ధ్యానం చేస్తూ, మానసిక ప్రశాంతతనూ, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. 2011 నుండి ధ్యాన ప్రచారం చేస్తూ విశేషంగా అన్ని రకాల క్లాసులకు హాజరు అవుతూ ఉన్నాము. 

 

ఈ మధ్య అక్టోబర్ 12వ తేదీన వచ్చిన హుద్‌హుద్ తుఫాను రోజు జరిగిన భీభత్సంలో మా ఇంటికి గానీ, పిరమిడ్‌కి గానీ ఏ నష్టం జరగలేదు. డాబా మీది ఆకులు వచ్చి పడడం వలన నీరు వెళ్ళడానికి ఆస్కారం లేక ఒకటిన్నర అడుగు లోతు నీరు నిలిచిపోయినా కూడా పిరమిడ్ లోకి నీరు వెళ్ళలేదు. ఏమీ పాడు అవలేదు. చుట్టూ వున్న అన్ని కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. వాటర్‌కీ గానీ, కరంట్‌కి గానీ ఎటువంటి సమస్యా రాలేదు. చుట్టుప్రక్కల ఉన్న అన్ని ఇళ్ళ కిటికీ అద్దాలు డాబా మీద రేకుల షెడ్‍లు డ్యామేజ్ అయ్యాయి కానీ మా ఇంటి అద్దాలు ఏమీ అవ్వకపోవడం విచిత్రం!

 

ఇదంతా పిరమిడ్ ధ్యానం మహిమ! దానిని మనకు అందించిన పత్రీజీ గారికి శతకోటి వందనాలు.

 

 

 

G.S.N మూర్తి

విశాఖపట్టణం

సెల్:+91 9440733748

Go to top