" రెల్లు గడ్డి పిరమిడ్ కూడా చెక్కు చెదరలేదు " 

 

 

 

నా పేరు "సత్యవతి". నేను ధ్యానంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది. "ఆనాపానసతి" ధ్యానం వల్ల నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. 

 

సీతమ్మ ధారలో, మా ఇంట్లో "శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యానకేంద్రం" నవంబర్ 11,2007 సంవత్సరంలో ప్రారంభమయి, అద్భుతమైన హీలింగ్ సెంటర్‌గా తయారయింది. 

 

విశాఖపట్టణం మొత్తం "హుద్‌హుద్ తుఫాను" ధాటికి అతాలకుతలం అయిపోయినా కానీ మా ఇంటి పైన "రెల్లుగడ్డితో కట్టిన పిరమిడ్" మాత్రం చెక్కు చెదరలేదు! నేనెంత పొంగిపోయానో చెప్పలేను! రెల్లుగడ్డి పిరమిడ్ మీద సిల్వర్ క్యాప్ కూడా ఎగరలేదు! 

 

దాని విశిష్టత వచ్చినవారందరికీ, చూపించాను. అనేక రకాల చెట్లతో మా సెంటర్ "ఆశ్రమం" లా వుంటుంది. అందులో సన్నగా ఉన్న అరటి చెట్లు కూడా పడలేదు, విరగలేదు.

 

సత్యవతి

విశాఖపట్టణం

 

Go to top