" అత్తగారికి కృతజ్ఞతలు "

 

 

నా పేరు "సులోచన". నేను గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన నడుమునొప్పితో బాధపడుతూ చికిత్సకోసం ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగాను. మందులు వాడినంతకాలం బాగానే ఉన్నా .. మందులు ఆపివేయగానే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేది. "రెండు లక్షలు ఖర్చుపెట్టి వెన్నెముకకు ఆపరేషన్ చెయ్యాలి" అని డాక్టర్లు సూచించారు కానీ .. "జబ్బు నయం అవుతుందని గ్యారెంటీ ఇవ్వలేము" అని చెప్పారు.

 

అప్పటికే ధ్యానసాధన ద్వారా తన గుండె జబ్బును నయం చేసుకున్న మా అత్తగారు "శ్రీమతి రాజమ్మ". మంచంపాలు అయిన నన్ను కూడా "ధ్యానం చేసుకో" అని చెప్పారు. గత పది సంవత్సరాలుగా ఆవిడ గుండెనొప్పితో బాధపడుతూ ఎంత డబ్బు ఖర్చుపెట్టిందీ .. మరి ధ్యానసాధన ద్వారా తక్కువ సమయంలో ఎంత ఆరోగ్యాన్ని పొందిందీ కళ్ళారా చూసిన నేను వెంటనే అత్తయ్య చెప్పినట్లు ధ్యానం చేయడం మొదలుపెట్టాను.

 

ఈ క్రమంలో తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకంచిరఘురామ్ గారి ఆధ్వర్యంలో తిరుపతి పిరమిడ్ మాస్టర్ M.జ్యోతిబాబు గారు తాటితోపులోని "ఆత్మారామ పిరమిడ్"లో ఏర్పాటు చేసిన "పిరమిడ్ ధ్యానశక్తి పీఠం"లో 41 రోజుల మండల ధ్యానతరగతులను ఏర్పాటు చేశారు. ఆ మండల ధ్యాన తరగతిలో క్రమం తప్పకుండా పాల్గొన్న నేను .. కొద్ది రోజులకే నా నడుము నొప్పి నుంచి శాశ్వత విముక్తిని పొందాను.

 

మొదట్లో ధ్యానంలో కూర్చోవడానికి ఎంతో ఇబ్బంది పడినా పట్టు వదలకుండా ప్రతిరోజూ ధ్యానాన్ని కొనసాగించాను. విశ్వశక్తితో నా శరీరం అంతా నిండిపోతున్న అనుభూతిని పొందేదానిని. ఇంటికి వచ్చాక కూడా మరింతగా ధ్యానం చేస్తూ మన సొసైటీలో లభించే పుస్తకాలనూ .. మరి "ధ్యానాంధ్రప్రదేశ్" లో వచ్చే సమాచారాన్ని .. చదువుతూ ఉండేదానిని. క్రమంగా నా ఆరోగ్యం సరి కాబడి నా పనులు నేనే చేసుకోవడం మొదలుపెట్టాను!! 41రోజులు గడిచేసరికి చక్కటి ఆత్మశక్తితో అద్భుతమైన జ్ఞానంతో నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారాను. నాకు ఈ ధ్యానవిద్యను పరిచయం చేసిన మా అత్తగారు "శ్రీమతి రాజమ్మ"కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ .. ఇంతటి అద్భుతమైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరవేస్తూన్న పత్రీజీకి వందనాలు తెలుపుకుంటున్నాను.

 

 

M.సులోచన

తాటితోపు

చంద్రగిరి

చిత్తూరుజిల్లా

సెల్:+918790351561.

Go to top