" ధ్యాన సేవలో మన జీవితాలు ధన్యం "

 

 

నా పేరు శేషగిరిరావు. ఏలూరు పట్టణానికి చెందిన "వాసవి సిల్క్స్ షోరూమ్" అధినేతనైన నేను నా భార్య శ్యామలతో సహా అయిదు సంవత్సరాల క్రితం పిరమిడ్ ధ్యాన ప్రపంచంలోకి రావడం జరిగింది. ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుసుకుని అందులోని గొప్పదనాన్ని స్వయంగా అనుభవించి ధ్యానఫలాలను పదిమందికీ పంచాలన్న తలంపుతో మా ఇంటిపై ధ్యానపిరమిడ్‌ను నిర్మించాము. ధ్యాన జగద్గురువు పత్రీజీ ఎంతో దయతో మా ఇంటికి విచ్చేసి మా షాప్‌లో ఏర్పాటుచేసిన నవీన ఆధ్యాత్మిక గ్రంథాలతో కూడిన లైబ్రెరీని మరి కేర్ సెంటర్‌నూ ప్రారంభించారు. అప్పటి నుంచి మా షాపులో నిరంతర ధ్యానతరగతులతో పాటు సంగీత శిక్షణా తరగతులు కూడా నిర్వహించబడుతున్నాయి. మా షాపు సిబ్బందిచే కూడా ప్రతి రోజూ రాత్రి తొమ్మిదిగంటల నుంచి పది గంటల వరకు ధ్యానశిక్షణ ఇస్తున్నాము.

 

 

శాకాహారం ప్రాశస్త్యాన్ని వివరించే బ్రోచర్లనూ మరి ధ్యానవిజ్ఞానాన్ని అందించే ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికలను మా కస్టమర్లకు అందిస్తూ మా వంతు ధ్యాన - స్వాధ్యాయ - అహింసా వ్రతాన్ని ఆచరిస్తున్నాం. వీలైనప్పుడల్లా ప్రక్కగ్రామాలకు కూడా వెళ్ళి అక్కడి పాఠశాలల్లోని విద్యార్థులకు ధ్యానప్రచారాన్ని చేస్తూ మా కుటుంబం యావత్తు బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నాము. ఇలా వ్యక్తిగత జీవితంలో పాటు వ్యాపార జీవితాన్ని కూడా ధర్మబద్ధంగా గడపగలిగే అవకాశాన్నీ మాకు అందించిన ధ్యానగురువు పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం!!

 

 

 

B.శేషగిరిరావు

ఏలూరు

పశ్చిమగోదావరి జిల్లా
సెల్:+91 92905 73947.

Go to top