" రుద్రపీఠం "

 

 

నా పేరు కమలమ్మ. నేను 2012, ఏప్రిల్‌లో తిరుపతి పిరమిడ్ మాస్టర్ "సుమతి" మేడమ్ ద్వారా పిరమిడ్ ధ్యాన పరిచయాన్ని పొందాను. అంతకు ముమ్దు అనేక సంవత్సరాలుగా నేను రకరకాల ధ్యాన పద్ధతులను అనుసరించి అందులోని విషయాలను తెలుసుకున్నాను. విపస్సన ధ్యాన కోర్సులు కూడా చేశాను. "శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం" నా జీవితంలో ఒక భాగంగా చేసుకున్న తరువాత నుంచి నా ఆరోగ్యంలో చక్కటి మార్పు, మానసిక దృఢత్వం, మరి నా ఆలోచనల్లో మరింత స్పష్టత ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిత్తూరు పిరమిడ్ మాస్టర్ డా||B.గోపాల కృష్ణ, రాధిక దంపతులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన "రుద్రపీఠం" సందర్శించి అందులో ధ్యానం చేసుకున్నాను. అలాంటి శక్తివంతమైన రుద్ర పీఠాన్ని మా ఇంట్లో ఏర్పాటు చేసుకున్న "శారదాదేవి పిరమిడ్ ధ్యానమందిరం" లో నిర్మించడం జరిగింది. అందులో ధ్యానం చేసుకుంటూన్న ఎంతో మంది అనారోగ్య సమస్యలు నుంచి విముక్తి చెందుతున్నారు.

 

ప్రతి శనివారం తిరుమలలో ఉన్న అనంత ఆళ్వార్ గుడిలో ధ్యాన శిక్షణా కార్యక్రమాలను గత సంవత్సర కాలం నుంచి నేను నిర్వహిస్తూ తిరుమలకు వచ్చే భక్తులకు పిరమిడ్ ధ్యాన సమాచారాన్ని అందజేస్తున్నాము. అమెరికాలో స్థిరపడిన మా అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ నేను చేస్తున్న కార్యక్రమాలను ఎంతగానో ప్రశంసిస్తూ నాకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్న మా స్వంత స్థలంలో పిరమిడ్ నిర్మాణం చేసి లోకకళ్యాణంలో మరింత భాగం పంచుకోవాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నాను.

 

 

కమలమ్మ

తిరుపతి

cell: +9178427 55798

Go to top