" వంద గ్రామాలలో ధ్యాన ప్రచారం "

 

 

"పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్" ముఖ్య ఆశయాలైన "ధ్యానజగత్" మరి "అహింసా శాకాహారజగత్" ల పరిసాధనలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా "సర్వ" మరి "పేర్నిపల్లి" గ్రామాల పిరమిడ్ మాస్టర్ల బృందం నలభై రోజుల పాటు జిల్లాలోని సుమారు వంద గ్రామాలలో విస్తృత ధ్యానప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

"భవిష్యత్తు అంతా మహిళలదే" అంటూ మహిళా శక్తిని అడుగడునా ప్రోత్సహించే ధ్యానజగద్గురువు బ్రహ్మర్షి పత్రీజి దివ్య ఆశీస్సులతో జిల్లాలోని మహిళా పిరమిడ్ మాస్టర్లు B. లావణ్య, G. సుహాసిని మరి G.లక్ష్మి గార్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

 

వీరి ఆధ్వర్యంలో మహిళా పిరమిడ్ మాస్టర్ల బృందం మక్తల్, ఉట్కారు, చిన్న చింతకుంట, నారాయణ పేట, మద్ధూరు, దామగిరి మండలాల్లోని సుమారు వంద గ్రామాలలో ఇంటింటికీ తిరిగి ధ్యాన కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. వీరికి తోడుగా సర్వ పిరమిడ్ మాస్టర్స్ G.మన్నెం, సంగం నర్సింహులు, బాలకృష్ణారెడ్డి, T.సత్యనారాయణరెడ్డి మల్లేష్, అంజి, K.ఈశ్వరయ్య గార్లు గ్రామాల్లో బైకుల మీద తిరుగుతూ, మైకుల్లో ధ్యాన శాకాహార స్లోగన్లు చేస్తూ ధ్యానప్రచారాన్ని అద్భుతంగా నిర్వహించారు!

 

పగలంతా ప్రచార కార్యక్రమం నిర్వహించి సాయంత్రాలు గ్రామాలలోని రచ్చబండల దగ్గర ధ్యానశిక్షణ సభలను ఏర్పాటు చేశారు. ఆ సభలలో ధ్యానం యొక్క విశిష్ఠతను తెలియజేసి .. నిరంతర ధ్యానసాధన ద్వారా పొందే లాభాలను వివరించడం జరిగింది. మహిళా పిరమిడ్ మాస్టర్లు తమ స్వీయ ధ్యానానుభవాలను వివరిస్తూంటే స్ఫూర్తి పొందిన గ్రామ మహిళలు తమకు ప్రత్యేకంగా సమయం కేటాయించి ధ్యానశిక్షణ ఇవ్వమని కోరారు.

 

విధ్యార్థులకు ధ్యానం వలన కలిగే లాభాలను గురించి విన్న ఉపాధ్యాయులు పిరమిడ్ క్యాపుల గురించి విశేష ఆసక్తిని కనబరిచి .. తమ తమ పాఠశాలల్లోని విద్యార్థులకు ధ్యానశిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.

 

ఇదివరలో మధ్యం త్రాగితే కానీ నిద్ర పోలేని గ్రామస్థులు కేవలం పదిరోజుల ధ్యాన సాధన వల్ల .. త్రాగుడు మానివేసినా హాయిగా నిద్రపోగలుగుతున్నామని వివరించడం .. కిడ్నీలో రాళ్ళ బాధతో ఉన్న ఒకానొక గ్రామస్థుడు ధ్యానం వలన తాను నొప్పి నుంచి విముక్తి చెందానని చెప్పడం .. మరి ఇంకొక గ్రామస్థుడు ఎన్నో ఏళ్ళుగా ఎన్ని మందులు వాడినా తగ్గని తన కంట్లోంచి నీరు కారడం తగ్గిపోయి ఇప్పుడు తాను స్పష్టంగా చూడగలుగుతున్నానని తెలియజేయడం .. పిరమిడ్ మాస్టర్లను ఎంతో ఉత్సాహపరచింది.

 

చాలా మంది గ్రామస్థులు ధ్యానంలో కూర్చోగానే తమకు జ్యోతి దర్శనం జరుగుతోందని తెలియజేశారు. ఒక్కొక్క గ్రామంలో అనేకానేక ధ్యానానుభవాలు విని ఆశ్చర్యపోయాం! ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వ తేదీ వరకు ఇరవై మూడు రోజుల పాటు మహాద్భుతంగా నిర్వహించబడిన "100 గ్రామాల ధ్యానప్రచార యాత్ర" లో అడుగడుగునా మాకు బ్రహ్మర్షి పత్రీజీ ఆస్ట్రల్‌గా తను ప్రేమపూర్వక మార్గదర్శనం చేస్తూ వచ్చారు.

 

"రెనిపట్ల" గ్రామంలో ధ్యానశాకాహార ప్రచారం ముగించుకున్న G.సుహాసిని మేడమ్ విపరీతమైన కాళ్ళు, చేతులు మరి ఛాతి నొప్పితో బాధపడుతూ ధ్యానంలో కూర్చోగా .. పత్రీజీ ఆస్ట్రల్‌గా వచ్చి కన్నతల్లిలా ఆమె కాళ్ళు, చేతులు వత్తి హీలింగ్ చేయడం మరి ఆమె కొద్దిసేపట్లోనే మళ్ళీ స్వస్థత చెంది ధ్యాన ప్రచారంలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరచింది. మహావతార్ బాబాజీ, వల్లభాపురం స్వామీజీ శ్రీ శ్రీ విఠలానంద బాబాజీ, ఆంజనేయ స్వామి అస్ట్రల్‌గా తమ సందేశాలను ఇచ్చి ధ్యాన ప్రచారంలో మాకు శక్తిని అందించారు. మహిళా శక్తి విస్ఫోటనానికి సజీవ ఉదాహరణగా నిలిచిన ఈ అద్భుత కార్యక్రమం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

 

 

 


B.ఆంజనేయరెడ్డి

నర్వ

మహబూబ్‌నగర్ జిల్లా
సెల్: +91 83747 76306

Go to top