" పిరమిడ్ నిర్మాణం గొప్ప అదృష్టం "

 

 

నా పేరు "శ్రీనివాస రాజు". నేను విజయనగరంలో S.P.M.E.M స్కూల్ కరెస్పాండెంట్‌ను. నాకు 2009, ఆగస్టు 27న ధ్యాన పరిచయం అయ్యింది. 2010 మే నెలలో సేత్ బాలకృష్ణ గారి "పిరమిడ్ మేకింగ్" C.D. ని చూసి 1.1/2 X 1.1/2 కొలతలతో ఒక చిన్న పిరమిడ్‌ను తయారు చేయించి దానితో అనేక ప్రయోగాలు చేసి పిరమిడ్‌ అద్భుతశక్తి గురించి తెలుసుకున్నాను.

 

ఆ పిరమిడ్ క్రింద ధ్యానం చేసిన వారందరూ "దీని క్రింద ధ్యానం చేసినప్పుడు శక్తి ఒక ధారలా పై నుండి క్రిందికి వస్తోంది .. ఇటువంటి పిరమిడ్ మాకు కూడా ఒకటి చేయించండి" అని అడగడంతో 2'X2' కొలతలతో సుమారు 200 పిరమిడ్‌లు చేయించాను.

 

11 ఏప్రిల్‌లో మా స్కూల్‌పైన 10'X10' కొలతలతో ఒక "రూఫ్ టాప్ పిరమిడ్" నిర్మించి పత్రీజీ చేతులమీదుగా దానిని ప్రారంభోత్సవం చేయించుకున్నాము. అప్పటినుంచి ప్రతిరోజూ పగలు, రాత్రి తేడా లేకుండా కనీసం పది మంది దానిలో ధ్యానం చేస్తూ ఉంటారు. అనేకమంది తమ కళ్ళు, గుండె, ఆస్తమా, బి.పి., షుగర్ సమస్యలను ధ్యానం చేసి తగ్గించుకోవడంతో ఈ పిరమిడ్ అద్భుతమైన "హీలింగ్ పిరమిడ్"గా కూడా గుర్తింపు పొందింది. దీనిలో ధ్యానం చేయడం కోసం విజయనగరంతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల నుంచి ధ్యానులు వచ్చేవారు.

 

పిరమిడ్ అన్ని చోట్ల ఉండాలని ఉద్దేశంతో నేను పిరమిడ్ నిర్మాణాలను మొదలుపెట్టాను. ఇప్పటివరకు సుమారు 100 పిరమిడ్‌లు పూర్తి అయ్యాయి! నా ఆధ్వర్యంలో కట్టించిన 60'X60' చిత్తూరు జిల్లా, పలమనేరులో "శ్రీ కృష్ణ మెగా హీలింగ్ పిరమిడ్" ప్రారంభోత్సవానికి సిద్ధంగా వుంది. ఈ అదృష్టాన్నీ .. ఇంతటి గొప్ప సేవ చేసే అవకాశాన్ని మా కుటుంబానికి కల్పించిన బ్రహ్మర్షి పత్రీజీ కి మా ఆత్మ ప్రణామాలు.

 

 

 

సఖినేటి శ్రీనివాసరాజు

పిరమిడ్ ఇంజనీయర్

విజయనగరం 

సెల్: +9195424 20000

Go to top