" పిరమిడ్‌శక్తిని ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్ళాలి "

 

 

 

నా పేరు "ఈశ్వర్ ప్రశాంత్". నేను ఇటీవలే M.Tech పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. మా నాన్నగారు డా|| J.V.సుబ్బారావు గారి ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను. మా అమ్మా, నాన్నా చెప్పినా సరే .. దేనినీ గ్రుడ్డిగా నమ్మే స్వభావం నాకు లేకపోవడంతో "ధ్యానశక్తిని గురించి కూడా స్వయంగా పరిశోధన చేసిన తరువాతే ‘నిజం’ అని నమ్ముదాం" అనుకున్నాను.

 

"పిరమిడ్ మూలంగా విశ్వశక్తి లభిస్తుంది" అన్న విషయంలోని శాస్త్రీయతను తెలుసుకోవాలనుకుని 2011లో మా ఇంటి ఆవరణలో కట్టించిన 12'X12' "శ్రీ శక్తి పిరమిడ్"లో 40 రోజులపాటు నిద్రపోయాను. పిరమిడ్‌లో పడుకున్నప్పుడు కలిగిన సూక్ష్మశరీర అనుభవాలు .. ఆ తరువాత భౌతిక జీవితంలో కూడా సాక్షాత్కరించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంటర్నెట్‌లో పిరమిడ్‌లపై అనేక మంది శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగాలు చదివి నేను కూడా కొన్ని చిన్న చిన్న పిరమిడ్‍లలో టమోటాలు, షేవిగ్ బ్లేడులు, పళ్ళు పెట్టి పరీక్షించాను.

 

నేను పిరమిడ్‌ల గురించి తెలుసుకునేటప్పటికే తెనాలి పట్టణంలో 24 పిరమిడ్‌లు ఉన్నాయి! "ఇంత శాస్త్రీయమైన శక్తిని కలిగి ఉన్న పిరమిడ్‌లు ఇంకా విస్తృతంగా తెనాలిలో నిర్మింపబడాలి; మరి పిరమిడ్ శక్తిని మరింత విస్తారంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి" అన్న మహా సంకల్పతో నేను 15 పిరమిడ్‌లలో 108 రోజుల పాటు సంకల్ప ధ్యాన యజ్ఞం చేశాను. ఆ సమయంలోనే తెనాలిలో నాలుగు క్రొత్త పిరమిడ్‌లు కట్టబడ్డాయి! మరి నేను చదువుకున్న స్కూలు యాజమాన్యం వారు కూడా మా స్కూలు ఆవరణలో పిరమిడ్ కట్టుకోవడానికి స్థలాన్ని వితరణ చేయడం జరిగింది! త్వరలో మా స్కూలు పాత విద్యార్థులం అంతా కలిసి అక్కడ ఒక ధ్యాన పిరమిడ్‌ను నిర్మించుకోబోతున్నాం!

 

ఒకసారి ఇంటర్నెట్‌లో "www.pyramidseverywhere.org" వెబ్‍సైట్‌ను బ్రౌజ్ చేస్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా 66 పిరమిడ్‌ల వివరాలు నమోదు చేయబడి ఉండడం చూశాను. ఆ తరువాత ఇంకా చాలా పిరమిడ్‌ల వివరాలు అందులో అప్‌డేట్ కాలేదని తెలుసుకుని .. నా మిత్రులతో కలిసి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా వెళ్ళి వారి పిరమిడ్‌ల ఫోటోలనూ మరి సమాచారాన్నీ సేకరించి బెంగళూరులో వెబ్‌సైట్‌ని నిర్వహిస్తూన్న "S.P.కృష్ణ చైతన్య" మరి "అయ్యప్ప" గార్లకు అందించాను. ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చెందిన 129 పిరమిడ్‌ల సమాచారం వెబ్‌సైట్‌లో నమోదు చేయబడింది.

 

ఇంకా క్రొత్త క్రొత్త ధ్యానులు నిర్మిస్తూన్న పిరమిడ్‌లు అనేకం ఉన్నాయి. వాటి వివరాలు కూడా త్వరలో సేకరిస్తాము. మీరంతా కూడా మీ, మీ ప్రదేశాల్లో ఉన్న పిరమిడ్‌ల వివరాలనూ మరి పిరమిడ్‌ శక్తికి సంబంధించిన పరిశోధనా సమాచారాన్నీ "www.pyramids everywhere.org" వెబ్‌సైట్‌కు పంపి .. పిరమిడ్ నిర్మాణ ఉద్యమంలో మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాం.

 

 

 

J. ఈశ్వర్ ప్రశాంత్

తెనాలి - గుంటూరు జిల్లా
+91 95506 79000

Go to top