" భూగ్రహ చైతన్యం కోసమే పిరమిడ్‍ల నిర్మాణం "

 

 

నా పేరు "రామారావు". ఇంజనీరింగ్ చదివి భవననిర్మాణ రంగంలో ఉన్న నేను మొదటి నుంచీ హేతువాద దృక్పథంతో ఉండేవాడిని. 2004లో ఒకానొక మిత్రుని ఇంట్లో "ధ్యానాంధ్రప్రదేశ్" మాసపత్రిక చూసి దానిలో ధ్యానం చేసే వారి అనుభవాలను చదివి చాలా ఆశ్చర్యానికి గురిఅయ్యాను. అదే రోజున "నేలాద్రి లక్ష్మీనరసింహస్వామి" ఆలయ ప్రాంగణంలో పౌర్ణమి ధ్యానం ఏర్పాటు చేశారని తెలిసి అక్కడకు వెళ్ళి మొదటిసారిగా ఒక గంట సేపు ధ్యానం చేసాను. అప్పటినుంచి నాలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరోజునుండి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తున్నాను!

 

ఒకరోజు నా మిత్రుడు ఫణికుమార్‌తో మొట్టమొదటి సారిగా ధ్యానం చేయిస్తూండగా అతడు తన మూడవకన్ను ఉత్తేజితం అవటం మరి సూక్ష్మశరీరం విడుదల కావడం వంటి అనుభవాలను పొందాడు. మేమిద్దరం అటవీ ప్రాంతాలలో వారం రోజులు ఏకధాటిగా అనేక గంటల పాటు ధ్యానస్థితిలో గడిపాము.

 

పిరమిడ్‍ల గురించి పెద్దగా తెలియని నాకు "పిరమిడ్‌ల నిర్మాణంలో నేనొక ప్రత్యేక పాత్ర పోషిస్తాను" అని నా మిత్రుడి ద్వారా సందేశం అందించబడింది. అప్పటికే భవననిర్మాణ రంగంలో నాకు కొంత అనుభవం ఉండటం వలన నమూనాగా 4'X4' కొలతలతో ఒక చిన్నపిరమిడ్‌ను సిమెంట్‌తో తయారుచేసాను. (పిరమిడ్ కొలతలు అప్పటికి నాకు తెలియవు) ఆ పిరమిడ్ కింద ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతమైన శక్తి ప్రకంపనలు అనుభూతి చెందాను.

 

తరువాత పిరమిడ్ నిర్మాణ సూత్రం ప్రకారం కొలతలను గమనిస్తే అవి నేను నిర్మించిన పిరమిడ్‌కు ఖచ్చితంగా సరిపోయాయి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ విధంగా నేను పిరమిడ్ నిర్మాణరంగంలో అడుగుపెట్టాను. పిరమిడ్ నిర్మించేటప్పుడు అధిక శక్తి ప్రకంపనలు శరీరంలోకి ప్రసరించడం .. అవ్యక్తమైన అలౌకిక స్థితి పొందటం, ఒక్కొక్కసారి విపరీతమైన నొప్పులు, శారీరక ఇబ్బందులు ఎన్నో అనుభూతి చెందటం, అనుభవించడం జరుగుతూ ఉంటుంది.

 

పిరమిడ్ ద్వారా వెలువడే శక్తి ప్రకంపనలు మానవాళికీ, సమస్త జీవరాశికీ, మరి భూగ్రహానికీ చేసే మేలు అంతా ఇంతా కాదు! పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ ధ్యానాభ్యాసం చేస్తున్నవారందరూ శాకాహారులుగా, సహృదయులుగా మరి మిత్రత్వం, కరుణ, ప్రేమ తత్వాలతో, దానగుణం, ధార్మిక లక్షణాలు మెండుగా అభివృద్ధి చెందిన నవ్య మానవులుగా మారుతున్నారు.

 

భూగ్రహం పైన జన్మ తీసుకున్న మనం .. మన లక్ష్యాన్నీ ఆధ్యాత్మిక ఎరుకనూ కోల్పోయి .. తోటి ప్రాణుల పట్ల అకృత్యాలు చేస్తూ ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జీవిస్తున్నాం. "వేదగ్రహం"గా ఉండాల్సిన భూమిని "వధ్య గ్రహం"గా మార్చి, దానిని నిరంతరం కౄరత్వంతో, హింసా ప్రవృత్తితో, ప్రతికూల ప్రకంపనలతో నింపుతూ గ్రహ చైతన్యాన్ని అధమ స్థాయికి తీసుకువెళ్ళాం. పురోగమించాల్సిన మనం తిరోగమన బాట పట్టాం.

 

సమతుల్యత కోల్పోయి గ్రహ మనుగడే ప్రశ్నార్థకమైన ఇటువంటి పరిస్థితిలో భూగ్రహం ఆగ్రహించకుండా మనల్ని అనుగ్రహించాలంటే .. తాను స్వస్థత పొంది శాంతించాలంటే మనల్ని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తూ తాను పురోగమనించాలంటే దానికి విశ్వశక్తిని అపారంగా అందించి, సమతుల్యతను కాపాడే పిరమిడ్‌లను విరివిగా నిర్మించాలి!

 

ప్రకృతి శక్తులు కన్నెర్ర చేయకముందే మనలోని దివ్య చైతన్యాన్ని మేల్కొలిపే పిరమిడ్ శక్తిని ఈ భూగ్రహంపైకి ఆహ్వానించాలి! దీనికి తోడు భూగ్రహాన్ని శక్తివంతం చేయడం కోసం ఉనత తలాలనుంచీ "క్రాప్ సర్కిల్స్ (స్వర్ణ రేఖలు)" అనే సాంకేతిక నిర్మాణాలు అందించబడ్డాయి. ఇది మాంసభక్షణ ద్వారా నిస్తేజమైన మానవ శరీరాలను పునఃశక్తివంతం చేయడం కోసం అందించబడిన సాంకేతికత. ఊర్థ్వలోకవాసులు వాటిని పంటపొలాలపై ఏర్పరుస్తారు.

 

ఆ ఆహారం భుజించినప్పుడు మనుష్యులు తమ అలవాట్లను మార్చుకోగలిగే శక్తినీ, జ్ఞానాన్నీ పొందుతారు. నేను ఆ నమూనాలను పిరమిడ్స్‌లో ఉపయోగిస్తూ పిరమిడ్ శక్తిని, క్రాప్ సర్కిల్స్ శక్తితో మిళితం చేస్తూ పిరమిడ్ నిర్మాణాలు చేస్తున్నాను. కొన్ని వందల, వేల పిరమిడ్ నిర్మాణాలలో నా పాత్ర ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

 

పిరమిడ్‌లే మన శ్వాస, మన ధ్యాస, మన పాలిట కామధేనువు, కల్పవృక్షాలు. "మన అసలైన లక్ష్యం వైపు మనల్ని నడిపించే వాహకాలు మరి వాహనాలు పిరమిడ్ నిర్మాణాలే" అని నేను ఘంటాపధంగా చెప్పగలను.

 

 

 

మెదరమెట్ల రామారావు
గుత్తావారి గూడెం

దమ్మపేట మండలం

ఖమ్మంజిల్లా
సెల్:- +9198660 44874.

Go to top