" హనుమాన్ పిరమిడ్ ధ్యానమందిరం "

 

 

నా పేరు "వెంకటేశ్వర్లు". ఖమ్మం జిల్లాలోని ఇల్లందు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న "ఉసిరికాయలపల్లి" గ్రామంలో "కోటమైసమ్మ గుడి" ఉంది. ప్రతి సంవత్సరం దసరా పండుగకు అక్కడ వేలాదిగా జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండడంతో అక్కడ రక్తం ఏరులై పారి .. ఆ ప్రదేశమంతా వాటి ఆక్రందనలతో మారు మ్రోగిపోతూ ఉండేది.

 

ఆ గుడి ఉన్న స్థలం అంతా కూడా ఇల్లందు పట్టనానికి చెందిన ప్రముఖ వైద్యులు "డా||పర్సా పట్టాభి రామారావు" మరి "డా||విజయలక్ష్మి" దంపతులకు చెందినది! పిరమిడ్ ధ్యానం పట్ల శాకాహార జీవన విధానం యొక్క గొప్పదనంపట్ల గౌరవ భావంతో ఈ దంపతులు .. ఆ స్థలంలో నుంచి పది ఎకరాల స్థలాన్ని పిరమిడ్ నిర్మాణం కొరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది!

 

వెంటనే "ఖమ్మం జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" అధ్యక్షురాలు "నలజాల సరోజ మేడమ్" అధ్వర్యంలో దాదాపు అయిదు లక్షల రూపాయల వారి స్వంత ఖర్చుతో అక్కడ 30'x30'ధ్యాన పిరమిడ్‌ను నిర్మించడం జరిగింది.

 

స్థల సేకరణలో సహకరించిన ఇల్లందు పిరమిడ్ మాస్టర్ "పసుపుల పుల్లారావు" మరి పిరమిడ్ నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు అక్కడే వుండి 108రోజుల పాటు సంకల్ప ధ్యానం చేసిన గోదావరిఖని పిరమిడ్ మాస్టర్ "అశోక్"లతో పాటు పిరమిడ్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఖమ్మం పిరమిడ్ మాస్టర్ "మానుకొండ రఘురామ్ ప్రసాద్", "పిరమిడ్ రామారావు" మరెందరో ఇల్లందు పిరమిడ్ మాస్టర్లు ఈ పిరమిడ్‌ నిర్మాణంలో పాల్గొన్నారు!

 

2012 జనవరి 20 వ తేదీన బ్రహ్మర్షి పత్రీజీచే ప్రారంభించుకోబడిన ఈ పిరమిడ్ వారు "హనుమాన్ పిరమిడ్ ధ్యానమందిరం"గా మరి పది ఎకరాల సువిశాల క్షేత్రానికి "పట్టాభిరామ పిరమిడ్ ధ్యానమహాక్షేత్రం"గా నామకరణం చేయగా వందలాదిమంది ధ్యానుల సమక్షంలో ఆనాటి కార్యక్రమం కన్నుల పండుగా జరిగింది!

 

ఆనాటి నుంచి అక్కడ క్రమం తప్పకుండా జరుగుతూన్న ధ్యాన కార్యక్రమాల వల్ల మరి పిరమిడ్ శక్తి తరంగాల ప్రభావం వల్ల అక్కడ ఉన్న "కట్టమైసమ్మ గుడి"లో జంతుబలులు కార్యక్రమం సుమారుగా ఆగిపోయి ప్రస్తుతం అక్కడ పురోహితుల ఆధ్వర్యంలో యజ్ఞయాగాదులు జరుగుతూ ఉన్నాయి.

 

 

 

S.వెంకటేశ్వర్లు

ఇల్లందు

ఖమ్మంజిల్లా
సెల్:+ 91 94409 79220.

Go to top