" ఆధునిక సంజీవని పిరమిడ్ శక్తి "

 

 

నా పేరు "వరలక్ష్మి". మాది విశాఖపట్టణంలోని మాధవధార, ఉడాకాలనీలో "మహేష్ పిరమిడ్ ధ్యానకేంద్రం". ప్రతి ఒక్కరికీ ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ మరి మోక్షమార్గాన్నీ ప్రసాదిస్తున్న పత్రీజీకి ఆత్మప్రణామాలు. "శ్వాస మీద ధ్యాస" అనే అమృతాన్ని అందరికీ పంచుతూన్న మైత్రేయ బుద్ధుడు, ‘నడయాడే దైవం’, సదా మన అందరితో ఉంటూన్న పత్రీజీ ప్రసాదితమే నా జీవితం. కోట్ల రూపాయలు ఉన్నా పొందలేని ఆత్మానందాన్ని నేను ధ్యానం ద్వారా ఈ రోజున పొందుతున్నాను.

 

మాకు ధ్యాన పరిచయం .. పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడులో మా బావగారైన "N.K.బాబు" గారి ద్వారా జరిగింది. 03.03.2007 తేదీన ఆకివీడులో వారి ఇంటి వద్ద జరిగిన ధ్యానశిక్షణా కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. "మా ఇంట్లో పిల్లల పెళ్ళికి రాకపోయినా పర్వాలేదు, ధ్యానశిక్షణా తరగతికి మాత్రం తప్పక రావాలి" అని కోరారు. అప్పుడు అది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా భావించి కుటుంబమంతా కలిసి వెళ్ళాము. అక్కడ ఆకివీడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ "సాంబశివరావు"గారిని పరిచయం చేసారు. చాలామంది మాస్టర్స్ సందేశాలు వారి అనుభవాలు చెప్పారు. నేను చేసిన మొదటి ధ్యానం అదే. నాలో తెలియని మార్పు ప్రారంభమయ్యింది.

 

అప్పటి నుంచి ధ్యానం చాలా తీవ్రంగా చేయడం మొదలుపెట్టాను. అలాగే వైజాగ్‌లో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఉందని చెప్పి ఇక్కడి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు P.V.రెడ్డినాయుడు, వీరజగదీశ్వరీ మేడమ్, డా||G.Kగార్లను మరి స్టీల్ ప్లాంట్ రేవతీ మేడమ్‌లను కలవమని చెప్పారు.

 

నాకు ధ్యానం అందే సమయానికి నా ఆరోగ్యం అంత బాగుండలేదు. అది గమనించిన మా బావగారు వెంటనే వైజాగ్ డాక్టర్ వద్దకు వెళ్ళమని చెప్పారు. మొదటి నుండి నాకు హాస్పిటల్ అంటే భయం. బలవంతంగా హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ నాకు రకరకాల టెస్టులు చేసి "మీ పరిస్థితి ప్రాణం పోయేదశ, బాగా లేటుచేసారు" అని డాక్టర్లు తిట్టారు. అప్పటికి నా హిమోగ్లోబిన్ 2% ఉంది. బెడ్ మీద పడుకుని బాగా ఏడ్చాను. కానీ ధ్యానం మీద నాకు కలిగిన నమ్మకంతో ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అక్కడినుండి నా జీవితంలో అన్నీ అద్భుతాలే.

 

హాస్పిటల్‌లో ఏం జరిగినా ఆస్ట్రల్ మాస్టర్ల ద్వారా జరిగిందని నాకు తెలిసింది. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఈ ధ్యానంలోకి వచ్చిన తరువాత మాంసాహారులమైన మేము పూర్తిగా శాకాహారులమైనాము. మా మొదటి సంతానం మహేష్ బాబు మానసిక లోపాలతో పుట్టాడు. వాడిని ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా ఎంతో ప్రేమతో పెంచుతున్నాం. ఆ ప్రేమకు నిదర్శనమే మా భవనంపై నిర్మించిన "మహేష్ పిరమిడ్ ధ్యానకేంద్రం".

 

మేము 2012 సంవత్సరం మే నెలలో బెంగళూరు వెళ్ళాము. అక్కడ పత్రీజీని మొదటిసారిగా కలిసాను. సార్‌ని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. అలాగే సార్ మా భవనంపై నిర్మించిన మహేష్ పిరమిడ్ ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ సందర్భంగా సార్ "మహేష్‌లో సిద్ధపురుషుడు ప్రవేశిస్తాడు; పిరమిడ్‌లో ఒక సంవత్సరం ధ్యానం చేయించండి" అని తెలియజేశారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతీ మేడమ్ గారి సహకారంతో సార్ చెప్పినట్లుగా 365 రోజుల పాటు మా పిరమిడ్‌లో అఖండ ధ్యానం నిర్వహించాము. వైజాగ్ మాస్టర్లందరూ 365రోజుల అఖండధ్యానంలో పాల్గొని ధ్యానఫలాలను పొందారు.

 

మా మహేష్ బాబుకి 2015 ఫిబ్రవరిలో మెడక్రింద కాయలాగా వచ్చింది. అది చాలా పెద్దది అయ్యింది. డాక్టర్ వద్దకు తీసుకుని వెళితే ఎక్స్‌రే, CTస్కానింగ్ మరి రకరకాల టెస్టులు అన్నీ చేసి మందులు వాడమన్నారు. రెండు నెలలు అయినా తగ్గకపోయే సరికి "సర్జరీ చేయాలి" అని చెప్పారు. సర్జరీ అంటే బాబు తట్టుకోలేడని మాకు బాధ కలిగింది. 2015 మార్చి 29న అక్కయ్యపాలెంలో జరిగిన పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సార్‌ని కలిసాను. సార్ "ఏమిటి సంగతి?" అని అడిగారు.

 

నేను నా బాధను తెలియజేసాను. సార్ నా కళ్ళలోకి చూస్తూ ఉన్నారు. సార్ కళ్ళనుండి నాకు అద్భుతమైన సందేశం అందింది. బాబుని 40రోజులపాటు పిరమిడ్‍లో పడుకోబెట్టమని దాని సారాంశం. 2015 మార్చి 29 నుంచి ఏప్రిల్ 20 వరకు 40రోజులుపాటు పిరమిడ్‌లో పడుకోబెట్టాం. మరి అద్భుతం ఏమిటంటే 30రోజులకే బాబు మెడక్రింద కాయ కరిగిపోయింది. పిరమిడ్ శక్తి సంజీవనిలా పనిచేసింది!

 

కేవలం పత్రిసార్ కళ్ళతో ఇచ్చిన సందేశం వలన బాబుకి అద్భుతం జరిగింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. మేము కేవలం ధ్యానం చేస్తూ బాబుని పిరమిడ్‌లో 40 రోజులు పడుకోబెట్టామని డాక్టర్లకు తెలియజేశాము. వాళ్ళు బాబుకి పరీక్షలన్నీ చేసి "ఇక సర్జరీ అవసరం లేదు" అని తెలియజేసారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని ఆత్మబంధువులు అందరికీ అందజేయాలని 40రోజులు పూర్తి అయిన తరువాత అందరినీ పిలిచి బాబు యొక్క అనుభవాన్ని తెలియజేశాను. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నందప్రసాద్ సార్ మరి రేవతీ మేడమ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని "ఇటువంటి అద్భుతాలు పిరమిడ్స్ ఉన్నందువలననే జరుగుతాయి" అని తెలియజేశారు.

 

 

 


P.వరలక్ష్మి

విశాఖపట్టణం జిల్లా
94416 62944.

Go to top