" పిరమిడ్ తయారీ నేర్చుకో "

 

 

నా పేరు "తిమ్మయ్యాచారి". నా ధ్యాన గురువులు మా తల్లిదండ్రులే. నేను 2006లో బుద్ధపౌర్ణమికి బెంగళూరు వెళ్ళి మొదటిసారి ధ్యానంలో కూర్చోగానే ఎన్నడూ చూడని అందమైన దృశ్యాలూ మరి ప్రకృతిలోని వివిధ జీవరాశులూ నాకు దర్శనమిచ్చాయి!

 

నేను, మా నాన్నగారు ఒకరోజు పత్రిగారి ఇంటికి వెళ్ళాము. అపుడు సార్ "ఏంటి సంగతులు?" అని అడిగారు. "అంతా ఓకే సార్" అన్నాను. "నువ్వు ఏం చేస్తూంటావు?" అని అడిగారు. "కార్పెంటర్ పని చేస్తూంటాను" అని చెప్పాను. అప్పుడు పత్రి సార్ "మనకు కొన్ని లక్షల పిరమిడ్స్ కావాలి, కాబట్టి నీవు పిరమిడ్స్ తయారు చేయడం నేర్చుకో" అని చెప్పారు.

 

తర్వాత 2009లో శ్రీశైలం ధ్యానమహాయజ్ఞంలో బాలకృష్ణగారి పిరమిడ్ వర్క్‌షాప్‌లో నేను పిరమిడ్‌లు తయారు చేయడం నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా 1'x1', 2'x2, 4'x4' సైజులో వుడ్ పిరమిడ్స్ తయారు చేస్తూన్నాను. ప్రతి ధ్యానమహాచక్రంలో స్టాల్స్‌ని నిర్వహిస్తున్నాను. ధ్యానవిద్యార్థి ఆఫీస్‌లో మెడిటేషన్ రూమ్ కొరకు, కొత్తపేట, మీర్‌పేట పిరమిడ్ కేర్ సెంటర్లకు, ధ్యాన మందిరాలకు, కావలసినవారందరికీ కొన్ని వేల పిరమిడ్స్ సరఫరా చేశాను!


2010
అమరావతి ధ్యానమహాచక్రంలో పాల్గొన్నప్పుడు ప్రాతఃకాల ధ్యానంలో "ఏడుపడగల పాము" నాలో చేరి పది నిమిషాల పాటు నాతో నాట్యం చేయించిన అనుభూతి పొందాను. ధ్యానం వల్ల నాకు కలిగిన మరొక గొప్ప అనుభవం నా భార్య గర్భవతిగా వున్నప్పుడే ఆమె గర్భంలో ఉన్న బాబును నేను చూసుకున్నాను. ఆ అనుభవం నా జీవితంలో మరిచిపోలేనిది.

 

కర్నూల్ జిల్లా బేతంచర్ల దగ్గర మా పల్లెలో ఇంటిపై నిర్మించిన పిరమిడ్‌లో మా గ్రామ ప్రజలు వచ్చి ధ్యానం చేసుకుని తమ తమ దీర్ఘకాలిక జబ్బుల నుంచి విముక్తి పొందుతున్నారు! అంతేకాక శాకాహారం యొక్క ఉపయోగం తెలుసుకుని చాలామంది శాకాహారులుగా మారుతున్నారు! ఈ మధ్యకాలంలో పిరమిడ్స్ గురించి చాలామందికి అవగాహన పెరిగి పిరమిడ్స్ కోసం అద్భుతమైన ఆర్డర్లు వస్తున్నాయి! మాకు ధ్యానాన్నీ, జ్ఞానాన్నీ అందించిన పత్రిగారికి నా ఆత్మాభివందనాలు.

 

 

 


తిమ్మయ్యాచారి

రామంతపూర్ 

హైదరాబాద్

వుడ్ పిరమిడ్స్ కొరకు సంప్రదించండి:
9391300096, 9550098987.

Go to top