" ధ్యానమే చైతన్య విస్తరణ మార్గం "

 

 

నా పేరు "సుహాసిని". మూడేళ్ళ క్రితం నర్వ గ్రామంలోని "నీలకంఠ పిరమిడ్" మూడవ వార్షికోత్సవానికి వెళ్ళడం .. ఆనాటి రాత్రి పిరమిడ్‌లో ధ్యానం చేయడం నా జీవితంలో ఒక గొప్ప మలుపుకు శ్రీకారం చుట్టింది.

 

రోజుకు మూడు పూటలు ట్యాబ్లెట్లు మింగడంతో పాటు జండూబామ్ రాసుకుంటున్నా తగ్గని తీవ్రమైన ‘మైగ్రేన్’ తలనొప్పి నాకు ధ్యానం ద్వారా తగ్గిపోయింది. కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో మానసిక ప్రశాంతత లేక "ఇక ఆత్మహత్య మాత్రమే నాకు దారి" అనుకుంటూన్న సందర్భంలో ధ్యానం మరి నర్వ పిరమిడ్ మాస్టర్ల సూచనలు, సలహాలు నా జీవన విధానాన్నే మార్చివేశాయి!

 

2012లో కడ్తాల్ జరిగిన ధ్యానమహాచక్రంలో పాల్గొని అక్కడ పత్రీజీ ప్రాతఃకాల సందేశాలు విని "నా ఆత్మ చైతన్యానికీ మరి ఆధ్యాత్మిక ఎదుగుదలకూ ధ్యానం ఎక్కువ చేయడమే ఉన్న ఒక్కగానొక్క మార్గం" అనీ, "నా వర్తమాన జీవితం నేను ఎంచుకున్నదే" అనీ అర్థమయ్యింది. ధ్యానంలో పరమశివుడినీ, షిర్డీ సాయినీ, మీరాబాయినీ మరి ఎందరో మాస్టర్స్‌ను దర్శించుకున్నాను. "ఇదే చివరి జన్మ చేసుకోవడానికి ధ్యానంతో పాటు ధ్యానప్రచారం మాత్రమే శరణ్యం" అని తెలుసుకున్నాను.

 

నర్వ పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయరెడ్డిగారు చేస్తున్న "గ్రామ గ్రామంలో ధ్యానం" ప్రచారంలో పాల్గొని 120 గ్రామాలలో ధ్యానప్రచారం చేశాను. గ్రామాలలో ఇంటింటికీ ధ్యాన కరపత్రాలు ఇస్తూ ధ్యానం గురించి వారికి చెబుతూ నా జీవితంలో పొందిన మధురానుభూతి మర్చిపోలేనిది. ధ్యానప్రచారంలో ఒక రోజు రాత్రి నేను విపరీతమైన ఛాతీనొప్పితో బాధపడుతూ కాళ్ళు చేతులు లాగుతూ ఏడుస్తూ ఉండగా నాతో పాటు అందరినీ కూర్చోబెట్టి ఆంజనేయరెడ్డి సార్ సంకల్ప ధ్యానం చేయించగా .. పత్రిసార్ వచ్చి కన్నతల్లిలా నా కాళ్ళు ఒత్తడం, వెంటనే నేను కోలుకోవడం ధ్యానంలో నాకు వచ్చిన అనుభవం!

 

 

సుహాసిని

శేర్నిపల్లి గ్రామం

మహబూబ్‌నగర్ జిల్లా

తెలంగాణ రాష్ట్రం

Go to top