" పిరమిడ్స్ తయారు చేస్తున్నప్పుడు ఎక్కువ శక్తి ప్రసరిస్తుంది "

 

 

నా పేరు "శ్రీహరి". నాకు 2008లో ఒక స్నేహితుడి ద్వారా S.R.నగర్ "మైత్రేయ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్" లో ధ్యానపరిచయం జరిగింది. నాకు ఎసిడిటీ ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తరువాత ఒక్క టాబ్లెట్ కూడా వాడకుండా ఎసిడిటీ పూర్తిగా తగ్గింది. ఆ సమయంలోనే నేను మాంసాహారం కూడా పూర్తిగా మానివేశాను. 2009 శ్రీశైలం ధ్యానమహాయజ్ఞానికి వెళ్ళి వచ్చినప్పటికి నుంచి పూర్తిగా ధ్యానకార్యక్రమాలలో పాల్గొని, ధ్యానం చేసుకుంటూ పిరమిడ్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాను.

 

పిరమిడ్ ఇంజనీయర్ "108 శ్రీనివాస్" గారి ఆధ్వర్యంలో జరిగిన పిరమిడ్ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ద్వారా పిరమిడ్‌లను తయారు చేసే విధానం తెలుసుకున్నాను. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ బాలకృష్ణగారి సలహా మేరకు కాపర్ మెటీరియల్‌తో అనేక రకాల పిరమిడ్స్ తయారు చేసి మొదటిసారిగా "2010 అమరావతి ధ్యానమహాచక్రం"లో స్టాల్ ఏర్పాటు చేశాను.

 

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకానొక క్రొత్త మోడల్ పిరమిడ్‌ను తయారుచేసి స్టాల్‌లో ఉంచడం చేస్తున్నాను. పిరమిడ్స్ చేసేటప్పుడు ఎనర్జీ ఫ్లో ఎక్కువగా ఉండడం గమనించాను.

 

"పిరమిడ్ పీఠం": ఈ పిరమిడ్ పీఠం తయారు చేయడానికి కావలసిన జ్ఞానం అంతా ధ్యానంలో అందించబడి దీనిలో 108 పిరమిడ్స్‌ను ఏర్పాటు చేశాను. వీటిలో 100 పిరమిడ్స్ (2'X2') కాపర్ పిరమిడ్స్‌ను పీఠం యొక్క బేస్‌లో ఏర్పాటు చేశాను. మిగిలిన ఎనిమిది పిరమిడ్‌లలో ఆరు పిరమిడ్‌లను ఆరు చక్రాల కోసం పిరమిడ్ పీఠం వెనుకప్రక్క అమర్చి మరి రెండు పిరమిడ్‌లను ఒక గ్రిడ్‌గా ఏర్పాటు చేసి మన సహస్రారం మీద వచ్చే విధంగా ఏర్పాటు చేశాను.

 

ఈ పీఠం మీద ధ్యానం చేసిన ధ్యానుల అనుభవాలు అద్భుతంగా ఉన్నాయి. "2012 కడ్తాల్ ధ్యానమహాచక్రం"లో ఒక ధ్యాని పీఠం మీద కూర్చుని ధ్యానం చేసినప్పుడు "కడ్తాల్ పిరమిడ్ కింగ్స్ ఛేంబర్‍లో కూర్చుని ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో దానికి పది రెట్లు అధికంగా ఎనర్జీని ఈ పీఠం ద్వారా పొందవచ్చు" అని సందేశం అందించడం జరిగింది. ఈ ధ్యానాన్నీ, జ్ఞానాన్నీ అందించిన పత్రిగారికి ధ్యానాభివందనాలు.

 

నేను తయారు చేస్తూన్న వివిధ రకాల పిరమిడ్‌లు: "పిరమిడ్ క్యాప్స్" .. "1'x1' .. 2'x2' పిరమిడ్స్" .. "ట్రీ పిరమిడ్స్" .. "మెర్కబా పిరమిడ్స్" .. "108 పిరమిడ్ పీఠం" .. "పిరమిద్ పిల్లోస్" .. "పిరమిడ్ వాటర్ కేన్స్" .. "స్కెలిటన్ పిరమిడ్".

 

 

 


M. శ్రీహరి

కూకట్‌పల్లి

హైదరాబాద్

+91 80199 50724

Go to top