" ధ్యానం వల్లనే నా కంటి చూపు మెరుగైంది "

 

 

నా పేరు "రాకేష్ శర్మ". ఇప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారు ప్రసాదరాజు, మా అమ్మగారు పద్మరాణి. నేను మా తల్లితండ్రులతో పాటు పది సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. నా చిన్నప్పుడు బలహీనంగా వుండటం వల్ల కంటి చూపు మెరుగ్గా లేక కళ్ళజోడు వాడవలసి వచ్చేది. మా అమ్మగారు "ధ్యానాంధ్రప్రదేశ్"లో వచ్చిన ఒక ఆర్టికల్ చదివి .. అందులో వ్రాసినట్లుగా ఒక పౌర్ణమి రోజంతా నా కళ్ళకు నల్లటి బట్టను కట్టి ధ్యానం చేయించారు.

 

అప్పటికి నేను ధ్యానం మొదలుపెట్టి అయిదారు నెలలు అవుతుంది. ఆ తర్వాత కంటి పరీక్ష చేసినప్పుడు అంతకు ముందు అక్కడ వారు చూపించిన బోర్డ్‌లోని క్రింద మూడులైనులూ చదవలేని నేను ఎంతో ఈజీగా అఖరిలైను కూడా చదివేశాను! దాంతో కళ్ళజోడు అవసరం లేకుండాపోయింది!

 

నేను 9వ తరగతి చదువుతూన్నప్పుడు మళ్ళీ ఒకసారి పరీక్ష చేయిస్తే అప్పుడు కూడా క్రిందలైను ఎంతో స్పష్టంగా చదివేశాను. నేను రోజూ ధ్యానం చెయ్యడం, శాకాహారం తీసుకోవడం ద్వారా నా కంటి చూపు మెరుగుపడడమే కాక నాలో బలహీనత అంతా పోయి, ఎంతో హుషారుగా తయారయ్యాను. చదువులోనూ, డ్యాన్స్‌లోనూ, డ్రాయింగ్‌లోనూ, కంప్యూటర్ పెయింటింగ్ లోనూ ఇంకా అనేక విషయాలలో నా నైపుణ్యం పెంచుకుని నా సమర్థత నిరూపించుకోగలుగుతున్నాను.

 

మా ఇంట్లో మా నాన్నమ్మ, అమ్మమ్మ, తాత, పిన్ని బాబాయి, మా అత్తయ్యలు, ఇంకా వారి పిల్లలు అంతా ధ్యానం చేస్తాం. మేము ధ్యాన ప్రచారం కూడా చేస్తాం. మాది ఒక పెద్ద ధ్యానకుటుంబం.

 

మీరంతా కూడా చిన్నప్పటినుంచే ధ్యానం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ధ్యానాన్ని మనకు అందించిన పత్రిసార్‌కి మనసారా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.

 


Y.రాకేష్ వర్మ

కొంపల్లి

సికిందరాబాద్

+ 91 93478 39014.

Go to top