" మేకల వ్యాపారం మాని .. ధ్యానప్రచారం! "

 

 

నా పేరు "నర్సిములు". నేను 2004 నుండి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అంతకు ముందు నేను తాగుడుకు బానిసనై అనారోగ్య సమస్యలతో ఉండేవాడిని. అల్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్న నాకు ధ్యానం ఒక దివ్య ఔషధంగా లభించింది. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు చెప్పిన వేలకువేల ఫీజులు చెల్లించలేక ఇంటికివచ్చి ధ్యానం చెయ్యడంతో అల్సర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది.

 

వృత్తిరీత్యా నేను గొర్రెల కాపరిని కావడంతో మేకలు పెంచుతూ జీవనం కొనసాగించేవాడిని. హైదరాబాద్‌లో జరిగిన ధ్యానమహాచక్రంలో పాల్గొని అక్కడ ఏడు రోజులు పాటు ధ్యానం చేసిన నాకు నా జీవిత గమ్యం మార్చుకోవడానికి పత్రీజీ ప్రవచనాలు ఎంతో దోహదపడ్డాయి. ఇంటికి తిరిగి వచ్చాక మాంసం కోసం మేకలను అమ్మే వ్యాపారాన్ని మానివేసి శాకాహారిగా మారి ఇతర చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ నాకు ఉన్న పొలం పనులు చూసుకుంటూ ఒక ట్రాక్టర్ కొనుక్కొని "పదిహేను ఎకరాలకు అసామిగా" .. దర్జాగా, ఆనందంగా జీవిస్తున్నాను.

 

నర్వ "నీలకంఠ పిరమిడ్"లో ప్రతిరోజూ మూడుగంటలు ధ్యానం చేస్తూ ఎంతో హాయిగా ఆనందంగా జివిస్తున్నాను. నర్వ మాస్టర్ "బంగ్లా ఆంజనేయరెడ్డి"గారు చేపట్టిన "గ్రామ గ్రామంలో ధ్యానం" ధ్యాన ప్రచార యాత్రలో పాల్గొంటూ నా జన్మ ధన్యం చేసుకుంటున్నాను.

 

 


నర్సిములు

నర్వ గ్రామం

మహబూబ్‌నగర్ జిల్లా - తెలంగాణ రాష్ట్రం

+91 80081 54470

Go to top