" పిరమిడ్స్ తయారీ మాస్టర్సే నేర్పారు "

 

 

నా పేరు "నాగరాజ రావు". 2008లో "ఆస్ట్రాలజీ" అనే పుస్తకం కొరకు షాపుకు వెళితే అనుకోకుండా "ఆత్మవిజ్ఞానం" అనే పుస్తకం లభించింది. అందులో "ధ్యానం" గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. అప్పుడే నాలో "ధ్యానం అంటే ఏమిటి?" అన్న ప్రశ్న బయలుదేరింది.

 

అదే సమయంలో నాకు ఒక కరపత్రం దొరికింది. అందులో ధ్యానం గురించి వివరంగా ఉండటం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. కరపత్రంలో ఉన్న అడ్రసు ప్రకారం వెళితే కూకట్‌పల్లి సాంబశివరావు గారి (ప్రస్తుతం వారు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.) మెడిటేషన్ సెంటర్ ఉంది. వారి పిరమిడ్‍లో మొట్టమొదటిసారిగా ధ్యానం చేయడం జరిగింది. అక్కడ శాకాహారం గురించి చెప్పారు. అయినా నేను దాన్ని గురించి పట్టించుకోలేదు.

 

ఆ రోజు రాత్రి నేను "ఆత్మవిజ్ఞానం పుస్తకంలో ‘శాకాహార ప్రసక్తి’ ఉంటే కనుక శాకాహారం తీసుకుంటాను" అనుకున్నాను. అందులో తరువాత పేజీలోనే ఈ విషయం, అహింస, జంతువుల పట్ల దయ, కర్మల గురించి ప్రస్తావన రావడం నాలో శాకాహారం గురించిన ఆలోచనను బలపరిచింది.

 

2009లో బెంగళూరు బుద్ధపూర్ణమకు వెళ్ళాను. అక్కడ ధ్యానం చేస్తూండగా నాలో కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవడం అనుభూతి చెందాను. అక్కడే బాలకృష్ణ సార్ వాళ్ళ పిరమిడ్ మేకింగ్ వర్క్‌షాప్‌లో పిరమిడ్స్ తయారు చేయడం నేర్చుకున్నాను. శ్రీశైలం ధ్యానమహాయజ్ఞం తర్వాత ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు జాబ్ మానివేయమని అంతర్ సందేశం వచ్చింది. వెంటనే నేను "అయితే ఏం చేయాలి?" అని ప్రశ్న వేసుకోగానే "పిరమిడ్స్ తయారు చెయ్యి" అని సమాధానం వచ్చింది. ఈ పిరమిడ్స్ తయారుచేయటానికి సంబంధించిన జ్ఞానం నాకు లేదు.

 

"ఏ మెటీరియల్ వాడాలి? అవి ఎక్కడ దొరుకుతాయి? ఎలా తయారు చెయ్యాలి?" ఇవేవీ నాకు తెలీదు. కానీ మాస్టర్స్ సహాయంతో ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న పని నేర్చుకున్నాను. అప్పటి నుంచి నేను పాలీప్రొప్లేన్ అనే మెటీరియల్‌తో పిరమిడ్స్ తయారుచేయడం స్టార్ట్ చేశాను. మొదటిసారిగా ఈ మెటీరీయల్‌తో "ట్రీ పిరమిడ్" తయారుచేశాను. అప్పటినుంచి నా పేరు "ట్రీ పిరమిడ్ నాగరాజు"గా మారింది.

 

అక్కడినుంచి క్యూబ్, కాస్మిక్ టవర్, మెర్కబా, టర్పైన్, 1'x1, 2'x2' పిరమిడ్స్ తయారుచేస్తున్నాను. పిరమిడ్స్ చేస్తున్నప్పుడు వచ్చే ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ చాలా అద్భుతంగా ఉంటుంది. 2010 నుంచి ప్రతి ధ్యానమహాచక్రంలోనూ పిరమిడ్ స్టాల్‌ని నిర్వహిస్తున్నాను. 2012లో నాకు నచ్చిన సందేశం ప్రకారం చిన్న పిరమిడ్స్ కాకుండా పెద్దపిరమిడ్స్, ట్రీ పిరమిడ్స్. కాస్మిక్ టవర్ 10'x10' సైజులో చేశాను. వాటిల్లో చాలామంది ధ్యానం చేసి ఎన్నో అనుభవాలు పొందారు. మేము కూడా ఎన్నో అనుభవాలు పొందాము. అప్పట్నించి పెద్ద పిరమిడ్స్ తయారు చేయడం మొదలుపెట్టాను. ఇవేకాక ఐరన్ స్ట్రక్చర్స్, 108 పిరమిడ్, 6'x6', 10'x10'తో పాటు ఇళ్ళపై పిరమిడ్స్ నిర్మాణాలు కూడా చేస్తున్నాను.

 


నాగరాజరావు

హైదరాబాద్

పిరమిడ్స్ కోసం సంప్రదించంది
+91 7386907407, +91 9948962676

Go to top