" ప్రతి సంఘటనకూ కారణం మన ఎంపికే "

 

 

నా పేరు "మన్నెం". నేను 2003 నుంచి ధ్యానం చేస్తూ నాలో ఉన్న హై బి.పి. వ్యాధి ధ్యానం ద్వారా పోగొట్టుకున్నాను మరి రాబోయే గుండెజబ్బు తగ్గించుకున్నాను. ఇంతగా ధ్యానం చేస్తున్నప్పటికీ మధ్య మధ్యలో వచ్చే శరీర నొప్పులు బాధలు ఎందుకు వస్తున్నాయో ధ్యానం ద్వారా అర్థంచేసుకున్నాను. గత జన్మలలో నేను చేసిన పాపకర్మల చిట్టా నాకు అవగతమయ్యింది.

 

"నా నిజ జీవితంలో వచ్చే అన్ని సంఘటనలకూ, సమస్యలకూ, కుటుంబ వ్యవహారాలకూ నా ఎంపికలే కారణం; అవి అన్నీ నా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే" అని అర్థం చేసుకున్నాను. మన వర్తమాన వాస్తవాన్ని మన సంకల్పంతో మార్చుకోవచ్చని అర్థం చేసుకుని ధ్యాన శక్తి ద్వారా నా వాస్తవ జీవితాన్ని నేనే మార్చుకున్నాను. సమస్యల సుడిగుండం నుంచి బయటపడటానికీ అప్పుల బాధనుంచి ఆర్థికంగా నాకు నేనుగా ఎదగడానికీ ధ్యానం నాకు ఎంతగానో ఉపయోగపడింది.

 

ప్రస్తుతం ఎరువులు మరి విత్తనాల వ్యాపారం చేస్తూ రోజూ "నీలకంఠ పిరమిడ్"లో రెండు గంటల చొప్పున ధ్యానం చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉన్నాను.

 

బంగ్లా ఆంజనేయరెడ్డి గారు చేస్తున్న "గ్రామ గ్రామంలో ధ్యానం" కార్యక్రమంలో నేను కూడా పాల్గొనే అవకాశం రావడం మరి ఎంతో మందికి ధ్యానం గూర్చి పరిచయం చేసే అవకాశం రావడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తూ పత్రీజీకి ప్రణామాలు అర్పిస్తున్నాను.

 

 


మన్నెం

నర్వ గ్రామం

మహబూబ్‌నగర్ జిల్లా - తెలంగాణ రాష్ట్రం

+ 91 95505 39971.

Go to top